వెంకట్ ను బయటపడేసేందుకు కెకె యత్నం: విలాసిని
హైదరాబాద్: తన కుమారుడు వెంకట్ ను కేసు నుంచి బయట పడేసేందుకు పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు ప్రయత్నిస్తున్నారని వెంకట్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో మరణించిన ప్రశాంత్ రెడ్డి భార్య విలాసిని ఆరోపించారు. ప్రశాంత్ రెడ్డి మృతి కేసులో సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని ఆమె శుక్రవారంనాడు మానవ హక్కుల కమీషనును కోరారు. తన భర్త మృతి కేసు విచారణలో రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్నాయని ఆమె విమర్శించారు.
సాక్ష్యాలను తారుమారు చేయడం, అధికారంతో విచారణను ప్రభావితం చేసి కేసును పక్కదారి పట్టించడం వంటి చర్యలకు కేశవరావు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. హైదరాబాదులోని జర్నలిస్టు కాలనీలోని ఫుట్ పాత్ లను, స్మశానాలను కేశవరావు ఆక్రమించుకున్నారని ఆమె ఆరోపించారు. వెంకట్, ఆయన భార్య దివ్య, పనిమనిషి నాగమణి, డ్రైవరులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications
