అమీర్ ఖాన్ పై ఇండోర్ కోర్టు వారంట్
ఇండోర్: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ పై ఇండోర్ జిల్లా కోర్టు వారంట్ జారీ చేసింది. జాతీయ పతాకను అవమానించారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ పై కోర్టు శుక్రవారం అమీర్ పై ఆ వారంట్ జారీ చేసింది. ఈ ఏడాది ఆగస్టు 16వ తేదీన జరిగిన ఒక షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అమీర్ ఖాన్ జాతీయ జెండాను అవమానించినట్లు కేసు నమోదైంది. అక్టోబర్ 12వ తేదీన తమ ముందు హాజరు కావాలని కోర్టు అమీర్ ఖాన్ ను ఆదేశించింది.
లగాన్ వంటి సినిమాలు తీసి దేశభక్తిని చాటుకున్న అమీర్ ఖాన్ కు జాతీయ జెండాను అవమానించినట్లు ఆరోపణలు రావడం కాస్తా ఇబ్బందికరమైన విషయమే. సినిమాల్లో వ్యాపార లక్షణాలను, ప్రయోజనాత్మకతను మేళవించి సినిమాలు తీసే ధోరణికి అమీర్ పాదులు వేశారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications
