బంద్ పై స్టే: రేపు కరుణానిధి నిరాహారదీక్ష
న్యూఢిల్లీ/చెన్నై: రామసేతు వివాదంపై తమిళనాడు ప్రభుత్వం అక్టోబర్ 1వ తేదీన తలపెట్టిన బంద్ పై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కరుణానిధి ప్రభుత్వం తలపెట్టిన రాష్ట్ర బంద్ ను సవాల్ చేస్తూ ప్రతిపక్ష అన్నాడియంకె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తలపెట్టిన బంద్ రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన అని పిటిషన్ లో విమర్శించారు.
సుప్రీంకోర్టు స్టేను నిరసిస్తూ ముఖ్యమంత్రి కరుణానిధి రేపు నిరాహార దీక్షకు దిగనున్నారు. డియంకె కూటమిలోని భాగస్వామ్య పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలు చేయనున్నారు. సేతసముద్రం ప్రాజెక్టు పనులు కేంద్రం వెంటనే ప్రారంభించాలని డిమాండు చేస్తూ డియంకె కూటమి పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి.












Click it and Unblock the Notifications