తెరాస అసమ్మతి ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అసమ్మతి శాసనసభ్యుల అనర్హతపై స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ఆదివారం విచారణ చేపట్టారు. విచారణను వచ్చే శనివారానికి ఆయన వాయిదా వేశారు. తొమ్మిది మంది శాసనసభ్యులు పార్టీ విప్ ను ధిక్కరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు వేటు వేయడంపై తెరాస శాసనసభా పక్షం స్పీకరుకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై స్పీకర్ విచారణ చేపట్టారు.
ఆ తొమ్మిది మంది తమ పార్టీ గుర్తుపై శాసనసభకు ఎన్నికయ్యారని, అందువల్ల పార్టీ విప్ ను ధిక్కరించిన వారిని అనర్హులుగా ప్రకటించాలని తెరాస శాసనసభా పక్ష నాయకుడు విజయరామారావు అన్నారు. తమ వాదనకు బలం చేకూర్చుకునేందుకు స్పీకరుకు ఆధారాలు సమర్పించామని ఆయన అన్నారు. కావాలనే నిర్ణయంలో జాప్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications