ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టు విస్తరణ: వైయస్
హైదరాబాద్: గోదావరినదిపై తలపెట్టిన ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టును తాండూరు - వికారాబాద్ వరకు విస్తరిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన ఆదివారంనాడు రంగారెడ్డి, మెదక్ జిల్లాలో పర్యటించారు. అనంతగిరిని ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామని ఆయన చెప్పారు.
వృద్ధులకు, వితంతువులకు ప్రతి నెల 1వ తేదీననే పింఛను చెల్లిస్తామని ఆయన చెప్పారు. వారికి నెలకు 200 రూపాయల పింఛను ఇస్తామని ఆయన చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications