బెజవాడ దుర్గమ్మ వారాహి నవరాత్రులకు వేళాయే.. ప్రత్యేకతలు ఇవే!

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి విజయవాడ నుండి ప్రసిద్ధ దుర్గ మల్లేశ్వర స్వామి దేవాలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఆషాఢ మాసోత్సవాలు నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించబడతాయి.

ఆషాడమాసంలో నిర్వహించే ఉత్సవాలలో అమ్మవారికి వారాహి నవరాత్రులు

హిందూ ధర్మంలో ఆషాడ మాసానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అటువంటి ఆషాడమాసంలో అమ్మవారి ఆరాధనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇవ్వబడింది. ఈ ఆషాడమాసంలో నిర్వహించే ఉత్సవాలలో అమ్మవారికి వారాహి నవరాత్రులు నిర్వహించడం విశేషం. ఈ సంవత్సరం వారాహి నవరాత్రులు ముఖ్య ఆకర్షణగా నిలువబోతున్నాయి. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు.

varahi navaratrulu during ashada maasotsavam Shakambari Alankaram bangaru boman are the highlights

శాకంబరీ దేవి స్వరూపంలో అమ్మవారు

జూలై 15వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ నవరాత్రులు నిర్వహిస్తారు. పూర్ణాహుతితో ఈ నవరాత్రుల్లో ముగుస్తాయి. ఆ తర్వాత జూలై 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అమ్మవారిని శాకంబరీ దేవి స్వరూపంలో అలంకరిస్తారు. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్ తో అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారు. శాకంబరీగా అలంకరణ గావించబడిన అమ్మవారిని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుండి భక్తులు విశేషంగా దర్శించుకుంటారు.

అమ్మవారికి ఆషాడమాస సారె సమర్పణ

ఈ సమయంలో అమ్మవారు ప్రకృతి మాతగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక వారాహి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ఆషాడమాస సారె సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 2017 సంవత్సరంలో ప్రారంభమైన ఈ సాంప్రదాయాన్ని ప్రస్తుతం ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్నారు. జులై 25వ తేదీన దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఆగస్టు 12వ తేదీన ఈవో, ఆలయ సిబ్బంది అమ్మవారికి శారీని సమర్పించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

బంగారు బోనం సారె సమర్పణ

జులై 26వ తేదీన భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ నుండి 500 మంది కళాకారులు బంగారు బోనం సారెను అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విశేష ఉత్సవాల నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశారు. మరి ఈ ఆషాడ మాసం ఉత్సవాలలో భాగంగా అమ్మవారిని దర్శించుకుని తరించాలని భక్తులకు ఆలయ కమిటీ స్వాగతం పలుకుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+