రమేష్ రెడ్డి ఇళ్లలో సోదాలు: కోటికి పైగా ఆస్తులు
హైదరాబాద్: హైదరాబాద్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమేష్ రెడ్డి ఇళ్లలో అవినీతి నిరోధక శాక (ఎసిబి) అధికారులు గురువారం సోదాలు చేశారు. రమేష్ రెడ్డికి కోటి రూపాయలకు పైగా విలువ చేసే అస్తులున్నట్లు తేలిందని ఎసిబి జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు. రమేష్ రెడ్డి నల్లగొండ జిల్లాలో ఎమ్మార్వోగా పని చేసి డిప్యుటేషనుపై ఇటీవల నగరానికి వచ్చారు.
హైదరాబాద్, నల్లగొండ, తదితర ప్రాంతాల్లోని ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఎసిబి అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో రమేష్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన కీలకమైన పత్రాలు లభ్యమయ్యాయి. ఇళ్లతో పాటు పలు ఆస్తులున్నట్లు తేలింది. బ్యాంకు లాకర్లను ఇంకా తీయాల్సి ఉంది.












Click it and Unblock the Notifications