కాంగ్రెసుపై దుమ్మెత్తిపోసిన చంద్రబాబు
అనంతపురం: కాంగ్రెసుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం తన అనంతపురం జిల్లా పర్యటనలో దుమ్మెత్తిపోశారు. కాంగ్రెస్ ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. బెంగుళూర్ నుంచి ఆయన హెలికాప్టరులో అనంతపురం చేరుకున్నారు. అనంతరం ఆయన యాత్ర మడకశిర వరకు సాగింది. అక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తాము చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఫలితాలు సాధించాయని, అయితే ఆ ఫలితాలు పేదలకు, రైతులకు అందడం లేదని ఆయన అన్నారు. అంతకు ముందు ఆయన హేమావతి శివాలయంలో పూజలు నిర్వహించారు. రైతులను, గొర్రెల కాపరులను ఆయన పరామర్శించారు. రెండు రోజుల పాటు ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications