రాష్ట్రంలో మధ్యంతరానికి సిద్ధం: కుమారస్వామి
బెంగూళూర్: రాష్ట్రంలో తాము మధ్యంతర ఎన్నికలకు సిద్ధమని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో అధికారాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ మద్దతు తీసుకోబోమని ఆయన అన్నారు. విక్టోరియా ఆస్పత్రి కార్యక్రమాని హాజరైన ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో కొద్దిసేపు మాట్లాడారు.
జెడి (యస్), బిజెపి సంకీర్ణ ప్రభుత్వం ఇంకా కొనసాగుతోందని, ఈ స్థితిలో కాంగ్రెస్ మద్దతు కోరే ప్రశ్న ఉత్పన్నం కాదని ఆయన అన్నారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం తర్వాత బిజెపికి అధికారాన్నిబదలాయించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కుమారస్వామి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ఒప్పందం మేరకు తమకు అధికారాన్ని బదలాయించాలని బిజెపి డిమాండు చేస్తోంది. తమ డిమాండుతో బిజెపి మంత్రులు రాజీనామాలు సమర్పించారు. అయితే వాటిని ముఖ్యమంత్రి ఆమోదించలేదు. దీంతో రాష్ట్రంలో తీవ్ర అనిశ్చిత పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications