సజీవ దహనం కేసులో 19 మందికి జీవితఖైదు
హైదరాబాద్: వరంగల్ జిల్లా సంగెం మండలం తిమ్మాపూర్ గ్రామంలో జరిగిన సజీవ దహనం కేసులో రాష్ట్ర హైకోర్టు 19 మందికి జీవిత ఖైతు విధిస్తూ గురువారం తీర్పు చెప్పింది. తిమ్మాపూర్ గ్రామంలో చేతబడి చేస్తున్నారనే అనుమానంపై ప్రజలు ఒకే కుటుంబానికి చెందిన 5గురిని సజీవ దహనం చేశారు. ఈ దారుణ సంఘటన 2000 ఆగస్టు 2వ తేదీన జరిగింది. ఈ కేసులో 70 మందిపై పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
వరంగల్ జిల్లా కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు కారపోవడంతో కేసు వీగిపోయింది. దాంతో వదలకుండా పోలీసులు రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. ఈ కేసులో సాక్ష్యులను ప్రవేశపెట్టడంలో పోలీసులు విజయం సాధించారు. దీంతో హైకోర్టు 19 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సజీవ దహనంలో మరణించివారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఒక బాలుడు ఉన్నారు.












Click it and Unblock the Notifications