రంగారెడ్డిలో భూకబ్జాలపై హైకోర్టు మండిపాటు
హైదరాబాద్: హైదరాబాదు పరిసరాల్లోని భూకబ్జాలపై రాష్ట్ర హైకోర్టు గురువారంనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. సరైన నివేదికలు సమర్పించకపోవడంపై రంగారెడ్డి జిల్లా కలెక్టరుపై, కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై హైకోర్టు మండిపడింది. జగదీశ్వర్ రావు అనే వ్యక్తి వేసిన పిటిషనుపై హైకోర్టు జిల్లా కలెక్టరును, కాలుష్య నియంత్రణ మండలిని నివేదికలు కోరింది.
జిల్లా కలెక్టరు, కాలుష్య నియంత్రణ మండలి సరైన నివేదికలు సమర్పించలేదని హైకోర్టు అంటూ ఈసారైనా సరైన సరైన నివేదికలు ఇవ్వాలని ఆదేశించింది. నాచారం, మౌలాలి, పటాన్ చెరులలో ఉన్న పరిశ్రమల వివరాలు అందించాలని హైకోర్టు కాలుష్య నియంత్రణ మండలిని ఆదేశించింది.












Click it and Unblock the Notifications