తెలంగాణపై సోనియా నిర్ణయం ఖాయం: విహెచ్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ విషయంలో తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ న్యాయం చేస్తారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు చెప్పారు. తెలంగాణ విషయంలో సోనియా గాంధీ న్యాయం చేస్తారనే నమ్మకం ఉందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. లోకసభకు మధ్యంతరం వస్తే ఏదో రూపంలో తెలంగాణపై సోనియా ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు.
ఎన్నికలకు ముందు తెలంగాణపై సోనియా నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు వద్దని తామందరం చెప్పామని, అయితే తెరాస పొత్తు పెట్టుకోవాల్సిందేనని సోనియా చెప్పారని ఆయన అన్నారు. తెరాసతో పొత్తుతో తెలంగాణలో కాంగ్రెస్ అధికంగా సీట్లు గెలిచే పరిస్థితి ఉందని తేలడంతో మలి విడత పోలింగులో కోస్తాలో కాంగ్రెస్ భారీగా సీట్లను సాధించిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications