వైయస్, చంద్రబాబు ప్రతిస్పందించాలి: నారాయణ
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మంచి మిత్రులని, వారు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణల నిగ్గు తేలాల్సి ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి పదవిని కూడా లోకాయుక్త పరిధిలోకి తేవాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిని లోకాయుక్త పరిధిలోకి తేవడానికి సుముఖంగా ఉన్నారో, లేదో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు తేల్చి చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై శాసనసభలో చర్చించాలని, అందుకు శాసనసభను వెంటనే సమావేశపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వారు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణల్లోని నిజనిజాలు బయట పడితే ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన అన్నారు. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications
