భూపోరు: కూలీలను చితకబాదిన సిపిఐ కార్యకర్తలు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో సిపిఐ కార్యకర్తలు గురువారంనాడు భూ పోరాటానికి దిగారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ నేతృత్వంలోని దాదాపు 3 వేల మంది పార్టీ కార్యకర్తలు 80 సర్వే నెంబరు భూములను ఆక్రమించుకున్నారు. ఈ సమయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిపిఐ కార్యకర్తలు అక్కడి కూలీలను చితకబాదారు. కట్టడాలను కూల్చారు. ప్రభుత్వ భూమిని అక్రమించుకుని అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని సిపిఐ కార్యకర్తలు ఆరోపించారు.
మాఫియా తుపాకులతో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అక్రమ కట్టడాలకు పూనుకుందని సిపిఐ కార్యదర్శి నారాయణ విమర్శించారు. పట్టా భూములే అయితే తమను చూడగానే ఎందుకు పారిపోతారని ఆయన ప్రశ్నించారు. ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచే వరకు పోరాటం సాగిస్తామని ఆయన చెప్పారు. తమను చూడగానే రౌడీలు పారిపోయారని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
