గంగా భవానిని వెనకేసుకొచ్చిన జియస్ రావు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారిపై దాడికి సంబంధించి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగా భవానిపై చర్య తీసుకునే విషయంపై పార్టీ కార్యవర్గ సమావేశంలో చర్చిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) తాత్కాలిక అధ్యక్షుడు జి.ఎస్. రావు చెప్పారు. నన్నపనేని రాజకుమారి ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డిపై చేసిన ఆరోపణలకు నిరసన తెలిపే కార్యక్రమాన్ని పార్టీ ఇవ్వలేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో స్పష్టం చేశారు.
పార్టీ కార్యక్రమం ఇచ్చి ఉంటే తప్పులేమైనా జరిగాయా అనేది పార్టీ సమీక్షిస్తుందని ఆయన చెప్పారు. రాజకుమారితో మాట్లాడడానికి గంగా భవాని బృందం వెళ్లి ఉంటుందని ఆయన అన్నారు. నన్నపనేని రాజకుమారి ఇంటికి వెళ్తున్నట్లు గంగా భవాని తమకు ముందు చెప్పలేదని ఆయన అన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో దిష్టిబొమ్మ దగ్ధం చేయడం వంటి కార్యక్రమాలు వారు చేశారని ఆయన సమర్థించారు.












Click it and Unblock the Notifications
