మూడు కమిటీలను సమావేశపర్చండి: పిజెఆర్
హైదరాబాద్: ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జారీ అయిన 610 జీవో అమలుకు వేసిన మూడు కమిటీలను సంయుక్తంగా సమావేశ పర్చాలని కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. శాసనసభా సంఘాన్ని, అధికారుల సంఘాన్ని, మంత్రి ఉపసంఘాన్ని సంయుక్తంగా సమావేశపర్చాలని, లేకుంటే ప్రయోజన ఉండదని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. శాసనసభా సంఘం సమావేశం గురువారంనాడు సమావేశమైంది.
610 జీవో అమలుపై ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నాటకాలు ఆడుతున్నారని తెలుగుదేశం శాసనసభ్యుడు టి. దేవేందర్ గౌడ్ విమర్శించారు. ఎజెండా లేకుండా సభా సంఘాన్ని సమావేశపరచడాన్ని ఆయన తప్పు పట్టారు. జిల్లాల మధ్య, వ్యక్తుల మధ్య తగాదాలు పెడుతూ 610 జీవో అమలుకు కుంటిసాకులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
