పొన్నూరు ఎమ్మెల్యే అరెస్టుకు యత్నం: ఉద్రిక్తత
గుంటూరు: గుంటూరు జిల్లా పొన్నూరు తెలుగుదేశం శాసనసభ్యుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ను అరెస్టు చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. అధికారులను నిర్బంధించిన కేసులో నరేంద్రకుమార్ పై కోర్టు అరెస్టు వారంటు జారీ చేసింది. దీంతో ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు గురువారంనాడు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో పొన్నూరులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
దాదావు 2 వేల మంది తెలుగుదేశం కార్యకర్తలు పొన్నూరు పోలీసు స్టేషనును ముట్టడించారు. పొన్నూరు బస్సు డిపోను పునరుద్ధరించాలని, లేదంటే శాసనసభ్యుడితో పాటు తమను కూడా అరెస్టు చేయాలని వారు పట్టుబడుతున్నారు. పొన్నూరు బస్సు డిపోను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ నరేందర్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగుదేశం కార్యకర్తలు అధికారులను నిర్బంధించారు. ఈ కేసులో నరేంద్రకుమార్ పై కోర్టు అరెస్టు వారంట్ జారీచేసింది.












Click it and Unblock the Notifications
