వెంకట్ కు అధికార పక్షం అండ: విలాసిని
హైదరాబాద్: తన భర్త మృతి కేసును రాజకీయ అండదండలతో నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్నారని పిసిసి మాజీ అధ్యక్షుడు కె. కేశవరావు కుమారుడు వెంకట్ ఇంట్లో జరిగిన కాల్పుల్లో మరణించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రశాంత్ రెడ్డి భార్య విలాసిని విమర్శించారు. తన భర్త మృతి కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఆమె గురువారంనాడు గవర్నర్ ఎన్.డి. తివారీకి వినతిపత్రం సమర్పించారు. కోర్టు ఈ నెల 25వ తేదీ వరకు జ్యుడిష్యల్ రిమాండ్ పొడిగించినా వెంకట్ అనారోగ్యం పేరుతో ఆస్పత్రిలో సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని, ఇది సాధారణ వ్యక్తులకు సాధ్యం కాదని ఆమె అన్నారు.
వెంకట్ కు అధికార పార్టీ అండదండలు అందుతున్నాయని తాను అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. కేసును సిబిఐకి అప్పగించాలని ఆమె గవర్నరును కోరారు. తనకు న్యాయం చేయాలని కోరడానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కూడా కలుస్తానని ఆమె చెప్పారు. ఇటీవల ఆమె తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని కూడా కలిశారు.












Click it and Unblock the Notifications
