గంగా భవానికి ముఖ్యమంత్రి అక్షింతలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి ఇంటిపై దాడి చేసిన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గంగాభవానికి ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అక్షింతలు వేశారు. గంగా భవాని గురువారం ఉదయం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాజశేఖర రెడ్డిని కలుసుకున్నారు. అలా చేయవద్దని తనకు ముఖ్యమంత్రి తనకు సూచించినట్లు గంగా భవాని భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
ఇక ముందు అలా చేయబోమని తాను ముఖ్యమంత్రితో చెప్పినట్లు ఆమె తెలిపారు. అయితే ముఖ్యమంత్రిని తిడితే సహించబోమని, నోళ్లకు స్టిక్కర్లు అతికించుకుని నన్నపనేని రాజకుమారి ఇంటి ముందు మౌన ప్రదర్శన చేస్తామని ఆమె చెప్పారు. వాళ్ల పాపానికి వాళ్లను వదిలేయండని ముఖ్యమంత్రి తనకు సూచించారని ఆమె చెప్పారు. గంగా భవాని నేతృత్వంలో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారంనాడు నన్నపనేని రాజకుమారి ఇంటిపై దాడి చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications
