అణు ఒప్పందంపై బుష్ తో మన్మోహన్ ఫోన్ సంభాషణ
అబుజా:అణు ఒప్పందం అమలులో అడ్డంకులు ఉన్నాయని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్‌కు తెలిపారు. తనతో జరిపిన టెలిఫోన్ సంభాషణ సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ విషయం స్పష్టం చేశారు. భారత్- అమెరికా అణు సహకార ఒప్పందం అమలులో కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయని బుష్‌కు ప్రధాని చెప్పారని ఆయన మీడియా సలహాదారు సంజయ్ బారు తెలిపారు.
ప్రపంచ వాణిజ్య సంస్థకు సంబంధించిన అంశాలను సైతం ఇరు దేశాధినేతలు చర్చించారని వెల్లడించారు. ఇరు దేశాధినేతల సమావేశానికి సరైన సమయం కలసి రాకపోవడంతో ఈ ఫోన్ చర్చలు జరిగాయని తెలిపారు. అణు ఒప్పందం కోసం ప్రభుత్వాన్ని పణంగా పెట్టబోమని గత వారం ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్న నేపథ్యంలో ఈ చర్చలు జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications