ఎసిబి వలలో పెద్దచేప: రు. 50 లక్షల అస్తులు
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర రెడ్డి ఇంటిలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు సోమవారం సోదాలు చేశారు. హైదరాబాదులోని ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో 50 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే అస్తుల పత్రాలు లభించాయి. హైదరాబాదు సమీపంలో ప్రభాకర్ రెడ్డికి 19 ఎకరాల స్థలం ఉన్నట్లు తేలింది.
కరీంనగరులో ఇల్లు ఉన్నట్లు సోదాలో బయటపడింది. ఆరు ప్లాట్లు, దుకాణాలు, మూడు ఇళ్లు, తదితర ఆస్తులున్నట్లు ఎసిబి సోదాల్లో బయటపడింది. ప్రభాకర్ రెడ్డి ఆదిలాబాదు ఎమ్మార్వోగా పనిచేశారు. నాలుగేళ్ల క్రితం బదిలీ అయి రంగారెడ్డి జిల్లాకు వచ్చారు. ప్రభాకర్ రెడ్డి మిత్రుడు రవీందర్ రెడ్డి ఇంట్లో కూడా ఎసిబి అధికారులు సోదాలు చేశారు.












Click it and Unblock the Notifications