నైజీరియాలో భారత బందీలకు విముక్తి
న్యూఢిల్లీ: నైజీరియాలో అపహరణకు గురైన నలుగురు భారతీయులు క్షేమంగా ఉన్నట్లు ఆదేశ ప్రభుత్వం వెల్లడించింది. వారిని కిడ్నాపర్లు క్షేమంగా విడుదల చేశారు. వారిని చేయించడానికి దేశ ఉన్నతాధికార వర్గాలతో పాటు ఆ నలుగురు పనిచేస్తున్న కంపెనీ కూడా ప్రయత్నించింది. వారి విడుదలకు కిడ్నాపర్లు 250 కోట్ల రూపాయలు డిమాండు చేశారు. ఆ మొత్తాన్ని చెల్లించి విడుదల చేయించుకున్నారా, లేదా అనేది తెలియడం లేదు. కిడ్నాప్ నకు గురైనవారిలో ముగ్గురు తమిళులు, ఒక మహారాష్ట్రీయుడు ఉన్నారు.
కిడ్నాప్ నకు గురైనవారు క్షేమంగా ఉన్నారని ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి నవ్‌తేజ్ సర్‌నా అంతకు ముందు విలేకరులతో చెప్పారు. వారిని త్వరలోనే విడుదల చేయించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నైజీరియాలో భారతీయులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. నైజీరీయాలో శనివారం ఇటాలియన్ కంపెనీలో పనిచేస్తున్న నలుగురు భారతీయ ఉద్యోగులను సాయుధులు కిడ్నాప్ చేశారు.












Click it and Unblock the Notifications