జిల్లా కలెక్టర్లపై ముఖ్యమంత్రి ఆగ్రహం
హైదరాబాద్: ఇందిరమ్మ పథకం అమలు తీరుపై అసంతృప్తి చెందిన ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఆయన మంగళవారంనాడు ప్రారంభించారు. ఇందిరమ్మ పథకంపై సమీక్ష జరిపారు. ఇందిరమ్మ పథకం కింద పేదలకు 85 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో 85 శాతం ఇళ్లను 2009 మార్చి నాటికి పూర్తి చేయాలని ఆయన అన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లకు చేరడానికి రెండు నెలలు పడుతుందా అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ప్రశ్నించారు. ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ప్రారంభోపన్యాసం సాగుతుండగా మంత్రులు కొంతమంది కునికిపాట్లు పడ్డారు. మరికొంత మంది హాయిగా నిద్రకుపక్రమించారు.












Click it and Unblock the Notifications