సోనియాకు చెప్పినా లాభం లేదు: వెంకటస్వామి
హైదరాబాద్: తనకు రాష్ట్రపతి ఇవ్వకపోవడంపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి మరోసారి నిరసనగళం విప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి చెప్పినా ఫలితం లేకపోయిందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎక్కణ్ణుంచో తెచ్చి ప్రతిభా పాటిల్ ను రాష్ట్రపతి సీటుపై కూర్చుండ బెట్టారని ఆయన వ్యాఖ్యానించారు.
అట్టడుగు వర్గాలకు నిధులు కేటాయిస్తున్నా వాటిని సక్రమంగా ఉపయోగించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెసుతో సహా ఏ పార్టీ కూడా దారిద్ర్యాన్ని నిర్మూలించలేదని ఆయన అన్నారు. మంత్రుల్లో, పార్లమెంటు సభ్యుల్లో తనకన్నా సీనియర్ ఎవరూ లేరని, అయినా తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వలేదని ఆయన అన్నారు. తాను మంత్రి పదవి ఇస్తే తీసుకునే స్థితిలో లేనని, ఈ వయసులో తనకు మంత్రి పదవి అవసరం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
