తెలంగాణపై వైయస్ మారకుంటే నష్టమే: ఎమ్మెస్సార్
విజయవాడ: ప్రత్యేక తెలంగాణపై మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎం. సత్యనారాయణ రావు తన వాదనను బుధవారంనాడు కూడా కొనసాగించారు. తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయడం వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రెండో ఎస్సార్సీ వేస్తామంటే ప్రజలు నమ్మబోరని, పార్టీ విశ్వసనీయత దెబ్బ తింటుందని, ఈ విషయాన్ని తాను పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీకి చెప్పానని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే పార్టీ ఘోరంగా దెబ్బ తింటుందని ఆయన అన్నారు.
తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తన వైఖరి మార్చుకోకపోతే పార్టీ దెబ్బ తింటుందని ఆయన అన్నారు. తెలంగాణపై సోనియాకు చెప్పడానికి తాము ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. రెండో ఎస్సార్సీ పార్టీ వైఖరి అయితే కావచ్చునని, అయితే ఇప్పుడు ఎస్సార్సీ వేయడం వల్ల లాభం లేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే వేసి ఉంటే కాస్తా ఉపయోగం ఉండేదని, ఇప్పటికే నివేదిక అందేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రమని, దీన్ని విడగొట్టడం సాధ్యమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications