బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. సీఎం రేవంత్ ఆ పని చెయ్యాలట!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 17 ఏళ్ల మైనర్ బాలికను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఎమ్మెల్సీ తీన్‌మార్ మల్లన్న స్పందించారు.
రేవంత్ రెడ్డి ఆ పని చెయ్యాలన్న తీన్మార్ మల్లన్న
చట్టం సామాన్యుడికి, ఉన్నత స్థాయి వ్యక్తులకు ఒకే విధంగా వర్తించాలని మల్లన్న స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కేసులో ఎలాంటి పక్షపాతం లేకుండా సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయకపోతే కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని ప్రజలు భావిస్తారని హెచ్చరించారు. బీజేపీ నాయకత్వం పూర్తి సహకరించాలని, ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని కూడా మల్లన్న కోరారు.

భగీరథ్ పై పోక్సో కేసు
సైబరాబాద్ పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 74, 75 మరియు పోక్సో చట్టం సెక్షన్లు 11, 12 కింద కేసు నమోదు చేశారు. బాలిక తల్లి ఫిర్యాదు ప్రకారం, గత డిసెంబర్ 31న మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో భగీరథ్ బాలికను బలవంతంగా మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. అంతకు ముందు నానక్‌రాంగూడ అపార్ట్‌మెంట్‌లో కూడా ఇలాంటి సంఘటన జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
హనీ ట్రాప్ చేశారని బండి సంజయ్ కుమారుడు కేసు
ఈ వేధింపులు తట్టుకోలేక బాలిక జనవరిలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిపారు. పోక్సో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే భగీరథ్ కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌంటర్ ఫిర్యాదు చేశారు. బాలిక మరియు ఆమె కుటుంబం తనను హనీట్రాప్ చేసి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
బాలిక కుటుంబంపైనా కేసు
ఇప్పటికే రూ.50 వేలు ఇచ్చినట్లు, మరిన్ని డబ్బులు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని తెలిపారు. దీంతో పోలీసులు బాలిక కుటుంబం పైనా వేరే కేసు నమోదు చేశారు.బాలిక వాంగ్మూలం ఈ కేసులో కీలకం. మైనర్ కావడంతో భరోసా కేంద్రంలో మహిళా పోలీసుల సమక్షంలో ఆమె వాంగ్మూలం నమోదు చేయనున్నారు.
రాష్ట్రంలో బండి తనయుడి నిర్వాకంపై రాజకీయ రగడ
కేంద్ర మంత్రి కుమారుడు, పోక్సో కేసులో ఉండటం వలన ఈ వ్యవహారం కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. బండి సంజయ్ ఈ కేసును తనపై కుట్రగా అభివర్ణించారు.ఈ హైప్రొఫైల్ కేసును ప్రభుత్వం ఎలా నిర్వహిస్తుందనేది ప్రస్తుతం అన్ని వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.













Click it and Unblock the Notifications