పాతాళానికి పసిడి ధరలు
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు బులియన్ మార్కెట్ ను దెబ్బకొట్టాయి. తీవ్రంగా ప్రభావితం చేశాయి. ప్రత్యేకించి జ్యవెలరీ స్టాక్స్ కుప్పకూలాయి. ఆయా కంపెనీల షేర్లన్నీ ఢమాల్ అయ్యాయి. ఈ ఉదయం స్టాక్ మార్కెట్ ప్రారంభమైన వెంటనే జ్యువెలరీ షేర్లన్నీ కూడా పతనం అయ్యాయి. టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, గోల్డియం ఇంటర్నేషనల్ వంటి ప్రముఖ బంగారు స్టాక్‌లు భారీ పతనాన్ని చవిచూశాయి.
ప్రధాని మోదీ ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రభావం అటు బంగారం ధరలపైనా పడింది. వాటి రేట్లు భారీగా పడిపోయాయి. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం దెబ్బకొట్టింది. అదే సమయంలో మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ చేసిన శాంతి ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించడం కూడా వీటి ధరల పతనానికి దారి తీసింది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ప్రారంభ ట్రేడింగ్‌లో 10 గ్రాముల బంగారం ధర పడిపోయింది. రూ. 1,51,989 వద్ద ట్రేడ్ అయింది. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో పోల్చుకుంటే 0.35 శాతం క్షీణత కనిపించింది. వెండి ధర మాత్రం పెరిగింది. 0.36 శాతం లాభపడింది. 2,62,866 రూపాయల వద్దకు చేరింది. ముంబైలో 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర 10 గ్రాములకు రూ. 1,52,130, 22 క్యారెట్లు రూ. 1,39,450గా నమోదైంది.
ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీ, జైపూర్‌లలో 22 క్యారెట్లు రూ. 1,39,600, 24 క్యారెట్లు రూ. 1,52,280 వద్ద ట్రేడ్ అవుతోంది. అహ్మదాబాద్, పుణెలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,39,500, 24 క్యారెట్లు రూ. 1,52,180 కాగా ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం రూ. 1,39,450, 24 క్యారెట్లు రూ. 1,52,130గా నమోదయ్యాయి. దేశంలో బంగారం ధరలను అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు ప్రధానంగా ప్రభావితం చేస్తాయి.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,382, 22 క్యారెట్లు - రూ. 14,100, 18 క్యారెట్లు - రూ. 11,770
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,213, 22 క్యారెట్లు- రూ. 13,945, 18 క్యారెట్లు - రూ. 11,410
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,213, 22 క్యారెట్లు- రూ. 13,945, 18 క్యారెట్లు - రూ. 11,410
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,213, 22 క్యారెట్లు- రూ. 13,945, 18 క్యారెట్లు - రూ. 11,410
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,213, 22 క్యారెట్లు- రూ. 13,945, 18 క్యారెట్లు - రూ. 11,410
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,213, 22 క్యారెట్లు- రూ. 13,945, 18 క్యారెట్లు - రూ. 11,410












Click it and Unblock the Notifications