విదేశాల తిరిగి వస్తూనే జగన్ అనూహ్య నిర్ణయం, వెంటనే..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. దీంతో.. పాలనా పరంగా.. రాజకీయంగా కీలక నిర్ణయాలు సమాయత్తం అవుతోంది. ప్రధాని మోదీ హైదరాబాద్ లో సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ నివాసాలకు వెళ్లటం కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ విదేశీ పర్యటన పూర్తి చేసుకొని తిరిగి వచ్చారు. పార్టీ పరంగా కీలక నిర్ణయానికి సిద్దం అవుతున్నారు.

మాజీ సీఎం జగన్ లండన్ టూర్ పూర్తయింది. విదేశీ పర్యటన ముగించుకొని జగన్ బెంగళూరు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి సీబీఐ కోర్టు అనుమతితో జగన్ విదేశాలకు వెళ్లారు. కాగా.. బెంగళూరు చేరుకున్న జగన్ రేపు (మంగళవారం) తాడేపల్లికి రానున్నారు. ఈ సమయం లోనే జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కూటమి ప్రభుత్వం పాలన రెండేళ్లు పూర్తవుతున్న వేళ ఇక రాజకీయంగా కీలక నిర్ణయాలు తప్పవని పార్టీ నేతలకు స్పష్టం చేసారు. అటు టీడీపీ మహానాడు ఈ నెలలో నెల్లూరు లో నిర్వహించేందుకు డిసైడ్ అయ్యారు. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత ఇప్పటి వరకు పార్టీ పరంగా జగన్ కీలక సమావేశాలు నిర్వహించలేదు. నియోజకవర్గ స్థాయి భేటీలకే పరిమితం అయ్యారు. పరామర్శల కోసం జిల్లాలకు వెళ్లారు. గత ఏడాదిలోనే జిల్లా పర్యటనలు.. కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని భావించినా.. ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీంతో, ఇప్పుడు వీటి పైన ముందుకు వెళ్లే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది.

మోదీ లెక్కే వేరు: మాతో 'కలవండి'.. సీఎం రేవంత్‌కు ఓపెన్ ఆఫర్‌ వెనుక..!!
మోదీ లెక్కే వేరు: మాతో 'కలవండి'.. సీఎం రేవంత్‌కు ఓపెన్ ఆఫర్‌ వెనుక..!!
ys-jagan-returned-to-bengaluru-this-morning-and-will-reach-tadepalli-on-tuesday-meeting-with-party

పార్టీ నేతలతో కీలక సమావేశం

దీంతో, ఈ నెల 13న పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశం కానున్నారు. రాష్ట్రంలో తాజా పరిస్థితుల పైన చర్చించనున్నారు. పార్టీ ప్లీనరీ ఈ ఏడాదే జూలై 8,9 తేదీల్లో నిర్వహించాలని కొందరు నేతలు ప్రస్తావిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి జగన్ పాదయాత్ర ఉండటంతో.. ఇప్పుడు పార్టీ ప్లీనరీ నిర్వహణ ద్వారా కేడర్ లో తిరిగి జోష్ పెంచేందుకు అవకాశం ఉంటుందని తాజాగా చేసిన ప్రతిపాదన పైన జగన్ నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ ప్లీనరీ నిర్వహించాలా.. లేక, జిల్లాల పర్యటనలు ప్రారంభించాలా అనేది జగన్ ఈ సమావేశంలో డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా నియోజకవర్గాల సమన్వయకర్తల పెండింగ్ లిస్టు పైనా జగన్ కసరత్తు చేస్తున్నారు. ఇక. నుంచి పూర్తి స్థాయిలో రాజకీయంగా తమ పాత్ర పోషించేందుకు సిద్దం కావాలని జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేయటంతో... కీలక నిర్ణయాల దిశగా జగన్ ప్రకటనలు ఉంటాయని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో.. జగన్ తీసుకునే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+