కూతురు ప్రేమ పట్టు: తల్లిదండ్రుల ఆత్మహత్య
ఏలూరు: కూతురు ప్రేమ వ్యవహారం నచ్చని తల్లిదండ్రులు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరులోని ఒక కాలనీలో నివాసం ఉంటున్న ముత్యాలు, లక్ష్మి అనే దంపతులు కూతురు గంగాభవాని ప్రేమ పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడంతో ఆత్మహత్య చేసుకున్నారు. గంగాభవాని ఇంటి ఎదురుగా ఉన్న ఒక యువకుడిని ప్రేమించింది. ఆ యువకుడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. అయితే తల్లిదండ్రులు అభ్యంతర పెట్టారు.
తల్లిదండ్రులు తమ మాట వినని కూతురుపై గొడవ పడ్డారు. కోపంలో శరీరాలపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నారు. కూతురు గంగాభవాని కూడా ఆ మంటల్లో దూకింది. దీంతో ఆ ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లిదండ్రులు మరణించారు. కూతురు మాత్రం చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications