చిరు తలకిందులేం చేయలేరు: కోటగిరి
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెడితే పరిస్థితులేం తలకిందులు కావని తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధర రావు అన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులేమీ ఉండవని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఉన్న పరిస్థితులు వేరని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఆయన అన్నారు. చిరంజీవి మాస్ ఇమేజ్ ఉన్న నటుడని ఆయన అన్నారు.
చిరంజీవి రాజకీయ పార్టీ పెడితే తాము స్వాగతిస్తున్నామని ఆయన చెప్పారు. సినీ నటులు రాజకీయ పార్టీలు పెట్టడం కొత్తేమీ కాదని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాటు దేలిన రాజకీయ పార్టీలున్నాయని, ఈ స్థితిలో చిరంజీవి పార్టీ పెడితే మార్పేమీ ఉండదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
