క్షుద్రదేవతలకు నాలుగేళ్ల బాలుడి బలి?
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలోని పసుమామల గ్రామంలో నాలుగేళ్ల బాలుడిని క్షుద్ర శక్తులకు బలి ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు సింహాద్రి ఐదో రోజు బుధవారం శవమై మురికి కాలువలో తేలాడు. బాలుడి శవాన్ని తండ్రి రామలింగం తన ఇంటి పక్క మురికి కాలువలో చూశాడు. బాలుడి కుడి కాలి పాదం నరికేసి ఉంది. దీంతో తమ కొడుకును దుండగులు ఎత్తుకెళ్లి క్షుద్రశక్తులకు బలి ఇచ్చారని తల్లిదండ్రులు శైలజ, రామలింగం అనుమానిస్తున్నారు.
నాలుగు రోజుల క్రితం సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో సింహాద్రి అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు తెలియజేశారు. దీంతో పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే బుధవారంనాడు బాలుడు శవమై కనిపించాడు.












Click it and Unblock the Notifications