చిరు వస్తే మార్పు తప్పదు: రోశయ్య
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే రాజకీయాల్లో మార్పులు తథ్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కె. రోశయ్య అన్నారు. ప్రజల సమీకరణల్లో తప్పకుండా మార్పు వస్తుందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీకి నష్టం జరుగుతుంది, ఏ పార్టీకి లాభం కలుగుతుందని ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు.
తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు చిరంజీవి ప్రకటించిన తర్వాత పార్టీల లాభనష్టాల గురించి అంచనాకు రావచ్చునని ఆయన అన్నారు. చిరంజీవి కొత్త పార్టీ పెట్టి సారధ్యం వహించినా, వేరే పార్టీలో చేరినా ప్రజల సమీకరణల్లో మార్పు వస్తుందని ఆయన అన్నారు. అయితే ఆ మార్పు ఏ మేరకు, ఎలా ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications