చిరు పార్టీ పెడితే నష్టపోతారు: బియస్పీ
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సొంత పార్టీ పెడితే విజయం సాధించలేరని బహు సమాజ్ పార్టీ (బియస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ అభిప్రాయపడ్డారు. సొంత పార్టీ పెట్టి నష్టపోయే కంటే తమ పార్టీలో చేరాలని ఆయన ఒక ప్రైవేట్ టీవీ చానెల్ ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవని, అందువల్ల చిరంజీవి సొంత పార్టీ పెడితే ఫలితం సాధించలేరని ఆయన అన్నారు. తమ పార్టీలో చేరితే చిరంజీవి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్ లో బ్రాహ్మణులు పోషించిన పాత్రను రాష్ట్రంలో కాపులు పోషిస్తారని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో తమకు పొత్తు ఉండదని, తాము పొత్తులకు వ్యతిరేకమని ఆయన అన్నారు. తెరాస అధ్యక్షుడు కెసిఆర్ కు తమ నాయకురాలు మాయావతి ఇప్పటి వరకు అప్పాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు. తెరాస పతనావస్థలో ఉందని, నిజాంను కెసిఆర్ కీర్తించిన తర్వాత మరింతగా పతనం మొదలైందని, తెరాసను కెసిఆర్ బియస్పీలో విలీనం చేయాలని ఆయన అన్నారు. సీనియర్ న్యాయవాది ఎస్. రామచంద్రరావు, తెరాస (ఎన్) అధ్యక్షుడు ఎ. నరేంద్ర తమ పార్టీలో చేరుతారని ఆయన అన్నారు. తమ పార్టీలో చేరకుండా నరేంద్రను ఎవరూ ఆపలేరని, అనారోగ్యం వల్ల నరేంద్ర చేరిక అలస్యమైందని ఆయన అన్నారు












Click it and Unblock the Notifications