సమ్మె విరమణకు జూ. డాక్టర్ల నిరాకరణ
హైదరాబాద్: తమపై దాడి చేసిన మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మెను విరమించడానికి నీలోఫర్ పిల్లల ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు తిరస్కరించారు. తమకు చర్చలు ముఖ్యం కాదని, శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ పై చర్యలు తీసుకోవడం ముఖ్యమని వారంటున్నారు. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపనున్నారు.
కాగా, నీలోఫర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. మంగళవారం ఒక్కరోజే ఐదుగురు మరణించారు. మరింతమంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే 8 మంది మాత్రమే చనిపోయారని ఆస్పత్రి సూపరింటిండెంట్ నరసింహారావు అంటున్నారు. సంపూర్ణ సమ్మెకు దిగే విషయంపై నీలోఫర్ సీనియర్ డాక్టర్లు ఈ నెల 8వ తేదీన నిర్ణయం తీసుకుంటారు.












Click it and Unblock the Notifications