జూనియర్ డాక్టర్లకు స్పీకర్ హామీ
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల డిమాండును సానుకూలంగా పరిశీలిస్తామని శాసనసభ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి హామీ ఇచ్చారు. తమపై దాడి చేసిన మజ్లీస్ శాసనసభ్యుడు అఫ్సర్ ఖాన్ పై చర్య తీసుకోవాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు, ఐఎంఎ ప్రతినిధులు బుధవారం స్పీకర్ ను కలిశారు. అఫ్సర్ ఖాన్ ను, మజ్లీస్ శాసనసభా పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ను పిలిపించి మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. వైద్యుల ఇబ్బందులను కమిటీల ద్వారా శాసనసభ దృష్టికి తేవాలని ఆయన జూనియర్ డాక్టర్లకు సూచించారు. తమపై దాడికి దిగిన అఫ్సర్ ఖాన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నీలోఫర్ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.
నీలోఫర్ జూనియర్ డాక్టర్లకు మద్దతు నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్) వైద్యులు ప్రదర్శన నిర్వహించారు. నీలోఫర్ సీనియర్ వైద్యులు బుధవారంనాడు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్సన నిర్వహించారు. జూనియర్ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 8వ తేదీ నుంచి ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. అనంతరం విధులకు హాజరయ్యారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రి వైద్యులు ఆందోళనకు దిగారు. అఫ్సర్ ఖాన్, విజయశాంతిల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.












Click it and Unblock the Notifications