కెసిఆర్ కు మతి తప్పింది: నరేంద్ర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెరాస (ఎన్) అధ్యక్షుడు ఎ. నరేంద్ర వ్యాఖ్యానించారు. నిజాంను కీర్తించిన కెసిఆర్ తెలంగాణ ద్రోహి అని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. నిజాంను ప్రముఖ కవి కాళోజీ పొగిడారని అనడం నిజం కాదని ఆయన అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాదని ఆయన అన్నారు.
కెసిఆర్ బిసిలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పదవి ఎస్టీకి ఇస్తానని అనడానికి కెసిఆర్ ఎవరని ఆయన అడిగారు. కెసిఆర్ పేదలకు వ్యతిరేకి అని ఆయన అన్నారు. త్వరలో తెలంగాణ వాదులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications