7గురు చివరి నిమిషంలో వచ్చారు: సూపరింటిండెంట్
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల సమ్మె ప్రారంభమైనప్పటి నుంచి అస్పత్రిలో 8 మంది చిన్నారులే చనిపోయారని నీలోఫర్ సూపరింటిండెంట్ నరసింహారావు బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. వారిలో ఏడుగురిని చివరి నిమిషంలో ఆస్పత్రికి తీసుకొచ్చారని, తగిన ప్రయత్నం చేసినా వారిని కాపాడలేకపోయామని ఆయన చెప్పారు. మరో చిన్నారి మెదడు వాపుతో అస్పత్రికి వచ్చిందని, దాంతో తాము కాపాడలేకపోయామని ఆయన చెప్పారు. జూనియర్ డాక్టర్ల సమ్మె వల్ల వైద్య సేవలకు ఏ విధమైన విఘాతం కలగలేదని ఆయన స్పష్టం చేశారు.
నీలోఫర్ లో అదనంగా 25 మంది జూనియర్ డాక్టర్లను, నర్సులను నియోగించినట్లు ఆయన తెలిపారు. వైద్య సేవలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందని, రోగులకు సేవలందించడానికి ఏ విధమైన ఆటంకాలు లేవని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ చంద్రవదన్ బుధవారం నాడు నీలోఫర్ అస్పత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య తగ్గినప్పటికీ వైద్య సేవల్లో లోపాలు లేవని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications