హైకోర్టుకు జుడాల ర్యాలీ: రోడ్డుపై బైఠాయింపు
హైదరాబాద్: తమపై దాడికి నిరసనగా నయాపూల్ అస్పత్రి జూనియర్ డాక్టర్లు శుక్రవారం సాయంత్రం ర్యాలీ తీశారు. ఆస్పత్రి నుంచి హైకోర్టుకు ర్యాలీగా వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జూనియర్ డాక్టర్లు రోడ్డుపై బైఠాయించారు. ఫలితంగా ట్రాఫిక్ స్తంభించింది. నీలోఫర్ ఆస్పత్రి సంఘటన మర్చిపోక ముందే ఈ సంఘటన జరగడం పుండు మీద కారం చల్లినట్లయింది. జకీరా అనే రిమాండ్ ఖైదీ మృతితో ఆమె బంధువు ఒకామె జూనియర్ డాక్టర్ కామాక్షిని చెప్పుతో కొట్టింది.
పథకం ప్రకారమే తమపై దాడులు చేస్తున్నారని జూనియర్ డాక్టర్లు విమర్శిస్తున్నారు. తమకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని వారన్నారు తమకు వైద్య విద్య డిగ్రీలు వద్దంటూ వైద్య విద్యార్థులు భారత వైద్య మండలి (ఎంసిఐ)కి లేఖలు రాశారు. బోధనాస్పత్రుల్లో విధులు బహిష్కరించి ర్యాలీకి వచ్చారు. హైకోర్టుపై గౌరవంతో, నమ్మకంతో తాము విధుల్లో చేరామని, పొద్దుటి పూట జరిగిన మృతికి ఇప్పుడు వచ్చి తమను కొట్టారని జూనియర్ డాక్టర్ల సంఘం నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications