ఇందిర, సోనియాలను వలస పక్షులనలేదు: కిరణ్


హైదరాబాద్: ఇందిరా గాంధీని, సోనియాగాంధీని తాను వలసపక్షులు అని అనలేదని కాంగ్రెస్ చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తాను అన్నదాన్ని మీడియా వక్రీకరించారని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాను చెప్పిన విషయాలను పూర్తిగా రాయకుండా వక్రీకరించారని ఆయన అన్నారు. తాను ఇందిర, సోనియాలను వలసపక్షులు అని అనలేదని, ఒకవేళ అని ఉంటే క్షమాపణ చెప్పడానికి వెనకాడబోనని ఆయన అన్నారు.

ఇందిర, సోనియాలను వలసపక్షులు అని అన్నందుకు క్షమాపణ చెప్పాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) ప్రధాన కార్యదర్శి నిరంజన్ కిరణ్ కుమార్ రెడ్డికి ఒక లేఖ రాశారు. కిరణ్ కుమార్ రెడ్డి అలా అనడం ద్వారా పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బ తీశారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+