యువతిపై సాఫ్ట్ వేర్ ఇంజనీరు దాడి
హైదరాబాద్: హైదరాబాదులోని నారాయణగుడా ఫ్లై ఓవర్ వద్ద ఒక యువతిపై ప్రేమోన్మాది దాడి చేశాడు. విజయకుమార్ అనే సాప్ట్ వేర్ ఇంజనీర్ ప్రియ అనే యువతిపై శుక్రవారం ఉదయం దాడి చేశాడు. ప్రియపై బండరాయితో మోదాడు. దీంతో ప్రియ తీవ్రంగా గాయపడింది. ఆమెను కేర్ అస్పత్రిలో చేర్చారు. ఆమె ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిటులో చికిత్స పొందుతోంది.
నారాయణగుడాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో బియస్సీ రెండో సంవత్సరం చదువుతున్న ప్రియ రోజు లాగే ఫ్లైఓవర్ దిగి మిత్రులతో మాట్లాడుతూ కాలేజీకి వెళ్తోంది. ఈ సమయంలో విజయకుమార్ ఆమెపై దాడి చేశాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతను ఇంతకు ముందు ఒక్కరిద్దరు అమ్మాయిలను ప్రేమించాడని, వారంతా అతని ప్రేమను తిరస్కరించారని, దీంతో యువతీయువకులు కలిసి మాట్లాడుకుంటే రెచ్చిపోతాడని పోలీసుల విచారణలో తేలింది.












Click it and Unblock the Notifications