మహిళా ఖైదీ మృతి: కామాక్షిపై దాడి
హైదరాబాద్: హైదరాబాదులోని నయాపూల్ జజ్జికానా అస్పత్రిలో జకీరా బేగం అనే మహిళా ఖైదీ మరణించింది. రిమాండ్ ఖైదీగా అమె చంచల్ గుడా జైలులో ఉంటోంది. ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను జజ్జికానా అస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె మరణించిందని ఆరోపిస్తూ అస్పత్రి వద్ద ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
జకీరా బేగం బంధువులు నయాపూల్ అస్పత్రి జూనియర్ డాక్టర్ కామాక్షిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆగ్రహించిన జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు. జకీరా నాలుగు నెలల గర్భవతి. ఈ నెల 10వ తేదీన కడుపు నొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో చేర్చారు. అయితే అకస్మాత్తుగా శుక్రవారం మరణించింది. ఆరోగ్య మంత్రి వచ్చే వరకు తాము శవాన్ని తీసుకెళ్లబోమని శాసనసభ్యుడు పాషా ఖాద్రీ అంటున్నారు.












Click it and Unblock the Notifications