కరీంనగర్ జిల్లాలో నర్సుపై దాడి
కరీంనగర్: కరీంనగర్ జిల్లా చందుర్తి మండలం రుద్రంగి గ్రామంలోని ఒక ప్రైవేట్ నర్సింగ్ హోం నర్సుపై దాడి జరిగింది. గర్భిణీ స్త్రీ మృతితో ఆగ్రహం చెందిన ఆమె బంధువులు ఆ ఆస్పత్రి నర్సును బయటకు లాక్కొచ్చి తీవ్రంగా కొట్టారు. గంగా భవాని అనే గర్భిణీ స్త్రీ మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో చేరింది.
ఆమెకు వైద్యం అందించేందుకు వైద్యులు ప్రయత్నించారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో కోరుట్లకు తీసికెళ్లాలని సూచించారు. దాంతో ఆమెను కోరుట్లకు తీసికెళ్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఆగ్రహించిన ఆమె బంధువులు తిరిగి వచ్చి నర్సుపై దాడి చేశారు. అప్పటికే వైద్యుడు, ఇతర సిబ్బంది పారిపోయారు.












Click it and Unblock the Notifications