చిరుతో అన్ని పార్టీలకూ నష్టం: లక్ష్మణ్
విశాఖపట్నం: మెగాస్టార్ చిరంజీవి రాజకీయ పార్టీ పెడితే అన్ని పార్టీలకూ నష్టమేనని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు బంగారు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయడుకు రైతులు ఇప్పుడు గుర్తొచ్చారా అని ఆయన మంగళవారం మిడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి వరాలు మధ్యంతర ఎన్నికలు సూచనలని ఆయన అన్నారు. రెండు రూపాయలకు కిలోబియ్యం, కాపులకు ప్రత్యేక కమిటీ కేవలం వరాలు మాత్రమేనని ఆయన అన్నారు. తెహెల్కా ఆరోపణల్లో ఇటు మీడియా అటు రాజకీయ పార్టీలు తనను దోషిగా నిలబెట్టాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications