మీడియాపై మంత్రి జెసి చిందులు
కర్నూలు: మీడియా ప్రతినిధులపై రాష్ట్ర మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి మంగళవారంనాడు చిందులు తొక్కారు. గొట్టం ఉంది కాబట్టి ఏమైనా అడగొచ్చని అనుకుంటున్నారా అని టెలివిజన్ చానళ్ల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మండిపడ్డారు. విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుని ఏమైనా అడిగితే మాట్లాడగలుగుతామని ఆయన అన్నారు. మేమేదో నేరస్తులమైనట్లు మీరేదో జడ్జిలు అయినట్లు మాట్లాడుతారని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.
చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడడానికి ఆయన నిరాకరించారు. చిరంజీవి బయట కనిపించి మాట్లాడినప్పుడు ఏమైనా చెప్పగలమని ఆయన అన్నారు. టమాటాలకు గిట్టుబాటు ధర కల్పించాలని సిపిఐ కార్యకర్తలు మంత్రి ఘెరావ్ చేశారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇస్తామని మంత్రి చెప్పడంతో వారు ఆందోళన విరమించుకున్నారు.












Click it and Unblock the Notifications