సత్తెన్నకు హాని లేదు: జానారెడ్డి
హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లు రాజిరెడ్డి అలియాస్ సత్తెన్న ప్రాణాలకు ఎటువంటి ప్రాణహాని లేదని హోం మంత్రి కె. జానారెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాగాయకుడు గద్దర్, రాజిరెడ్డి బంధవులు మంగళవారం జానారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. రాజిరెడ్డికి ఏ విధమైన ప్రాణహాని తలపెట్టవద్దని, కోర్టులో హాజరు పరచాలని వారు మంత్రిని కోరారు.
ప్రభుత్వం మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర నాయకులను హతమారుస్తోందని గద్దర్ మీడియా ప్రతినిధులతో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా మద్దతును కోల్పోయిందని ఆయన అన్నారు. రాజిరెడ్డిని కోర్టులో హాజరు పరచాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications