సిఎం హెచ్చరికపై జుడాల మండిపాటు
హైదరాబాద్: ఎస్మా ప్రయోగిస్తామని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన హెచ్చరికపై జూనియర్ డాక్టర్లు మండిపడుతున్నారు. మజ్లీస్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ గుర్తు చేసిన తర్వాతనే ముఖ్యమంత్రికి ఎస్మా గుర్తుకు వచ్చిందని వారన్నారు. తమను గవర్నమెంట్ సర్వెంట్సుగా గుర్తించిన తర్వాత ఎస్మా ప్రయోగానికి సిద్ధపడుతోందని వారన్నారు. తమకు గవర్నమెంట్ సర్వెంట్సుకు ఉన్న అన్ని సౌకర్యాలను కల్పించి ఎస్మా ప్రయోగించాలని వారంటున్నారు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తమను బలపరిచిన రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత లిఖితపూర్వక హామీలు ఇస్తున్నారే తప్ప అమలు చేయడం లేదని వారన్నారు. శాసనసభ్యుల అరెస్టును ముఖ్యమంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నామని వారన్నారు. జూనియర్ డాక్టర్లపై ఎస్మా ప్రయోగిస్తామనే ముఖ్యమంత్రి హెచ్చరికపై బిజెపి శాసనసభ్యుడు జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎస్మాను జూనియర్ డాక్టర్లపై ప్రయోగించలేదని ఆయన అన్నారు. మజ్లీస్ శాసనసభ్యులను గుండా యాక్ట్ కింద అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications