హాని చేయవద్దు: సత్తెన్న తల్లి


Varavara Raoహైదరాబాద్: అరెస్టయిన తమ కుమారుడు, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లు రాజిరెడ్డి అలియాస్ సత్తెన్నకు హాని తలపెట్టదని ఆయన తల్లి రాజమ్మ కోరుతోంది. ఈ మేరకు ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేయడానికి హైదరాబాద్ బయలుదేరింది. రాజిరెడ్డి వెంటనే కోర్టులో హాజరు పరచాలని, ఎలాంటి ప్రాణహాని తలపెట్టవద్దని విప్లప రచయితల సంఘం (విరసం) కార్యవర్గ సభ్యుడు వరవరరావు డిమాండ్ చేశారు. ఒక మహిళతో పాటు రాజిరెడ్డిని కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు సోమవారం అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి.

పీపుల్స్ వార్ తొలితరం నాయకుల్లో రాజిరెడ్డి ఒకరు. ఆయన 1975 ప్రాంతంలో అప్పటి పీపుల్స్ వార్ లో చేరారు. ఆయన తలపై 15 లక్షల రూపాయల రివార్డు ఉంది. రాజిరెడ్డి మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రస్తుత కార్యదర్శి గణపతి నాయకత్వంలో ఆయన కరీంనగర్ జిల్లా మంధని దళ సభ్యుడిగా పనిచేశారు. దండకారణ్య కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. రాజిరెడ్డి కరీంనగర్ జిల్లా మంధని మండలం శాస్త్రులపల్లి గ్రామానికి చెందినవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+