హైకోర్టులో సత్తెన్న సోదరుడి పిటిషన్
హైదరాబాద్: మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మల్లు రాజిరెడ్డి అలియాస్ సత్తెన్నను కోర్టులో హాజరు పరచాలని కోరుతూ ఆయన సోదరుడు భీమారెడ్డి మంగళవారంనాడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణను హైకోర్టు రేపటి వాయిదా వేసింది. రాజిరెడ్డిని కేరళలోని ఎర్నాకులంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అంతకుముందు భీమారెడ్డి ప్రజాగాయకుడు గద్దర్ తో కలిసి హోంమంత్రి కె. జానారెడ్డిని కలిశారు. తమ సోదరుడు రాజిరెడ్డిని కోర్టులో పరచాలని కోరుతూ ఆయన జానారెడ్డికి ఒక వినతిపత్రం సమర్పించారు. రాజిరెడ్డి పోలీసుల అదుపులోనే ఉన్నాడని, రాజిరెడ్డికి ఏ విధమైన ప్రాణహాని లేదని జానారెడ్డి చెప్పినట్లు భీమారెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.












Click it and Unblock the Notifications