ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి
రాజమండ్రి: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం స్పెషల్ పార్టీ పోలీసులు మారేడుమిల్లి మండల కేంద్రానికి సుమారు 32 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు జరిగాయి. దీనితో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. మృత దేహాలను రంపచోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరణించిన ఇద్దరు మహిళల వయసు 20 సంవత్సరాలు ఉంటాయని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications