'షోలే' నిర్మాత సిప్పీ కన్నుమూత


ముంబై: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు జి.పి. సిప్పీ మంగళవారం రాత్రి కన్నుమూశారు. సంచలనం సృష్టించిన షోలే సినిమాను నిర్మించింది ఆయనే. చాలా కాలంగా ఆయన అస్వస్థతతో బాధ పడుతున్నారు. ఆయనకు 93 ఏళ్లు. మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం పాకిస్తానులో ఉన్న సింధ్ లో ఆయన 1914 సెప్టెంబర్ 14వ తేదీన జన్మించారు.

1955లో మెరైన్ డ్రైవ్ అనే సినిమాతో ఆయన సినీరంగంలో వెలుగులోకి వచ్చారు. ప్రదీప్ కుమార్, మీనాకుమారి, దుర్గా కోటేలతో ఆయన అదే ఏడాది ఆద్ లో జహంగీర్ అనే సినిమాను తీశాడు. యాభై, అరవైలలో ఆయన పలు చిత్రాలు నిర్మించారు. శ్రీమతి 420, చంద్రకాంత్, లైట్ హౌస్, భాయ్ బెహన్, అందాజ్ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. వాటికి ఆయనే దర్శకత్వం వహించారు. 1972లో ఆయన కుమారుడు రమేష్ షిప్పీతో కలిసి హేమమాలిని ద్విపాత్రాభినయంతో సీతా ఔర్ గీతా అనే సినిమాను తీశారు. రమేష్ షిప్పీ దర్శకత్వంలోనే ఆయన షోలే సినిమాను నిర్మించారు. సాగర్, రాజు బన్ గయా జెంటిల్ మన్, ఆతీష్ వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయనకు 1968, 1982లలో ఫిల్మ్ ఫేర్ అవార్డులు లభించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+